మీరు ఒక్కరే కాదు

మీరు ఒక్కరే కాదు

మీరు ఒక్కరే కాదు

~300,000,000

ప్రజలకు సికిల్‌ సెల్‌ వ్యాధి ఉంది*

~6,400,000

మంది ప్రజలు సికిల్‌ సెల్‌ వ్యాధితో జీవిస్తున్నారు

~300,000

మంది పిల్లలు ప్రతి సంవత్సరం సికిల్‌ సెల్‌ వ్యాధితో పుడుతున్నారు

*సికిల్‌ సెల్‌ వ్యాధి గల ప్రజల్లో 1 మామూలు హిమోగ్లోబిన్‌ జీన్‌ మరియు 1 సికిల్‌ హిమోగ్లోబిన్‌ జీన్‌ ఉంటోంది.

సికిల్‌ సెల్‌ వ్యాధి గల ప్రజలకు 2 సికిల్‌ హిమోగ్లోబిన్‌ జీన్స్‌ ఉంటాయి మరియు సికిల్‌ సెల్‌ వ్యాధి లక్షణాలు అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అనేక మంది ఇతరులు కూడా సికిల్‌ సెల్‌ వ్యాధితో బాధపడుతున్నారు

సికిల్‌ సెల్‌ వ్యాధి అనేది వారసత్వ వ్యాధి మరియు ప్రపంచంలోని చాలా సామాన్యమైన జన్యుపరమైన రక్తం అవ్యవస్థలు కలది.

సికిల్‌ సెల్‌ జీన్‌ వేలాది సంవత్సరాల క్రితం మలేరియా ఉన్న ప్రాంతాల్లో ఉద్భవించింది మరియు విస్త్రుతంగా కొనసాగుతోంది. ఆఫ్రికాలో పుట్టిన కారణంగా, సికిల్‌ సెల్‌ వ్యాధి ప్రాథమికంగా ఆఫ్రికన్‌ పుట్టుపూర్వోత్తరాలు గల ప్రజలను ప్రభావితం చేస్తోంది. మలేరియా నుంచి కూడా సికిల్‌ సెల్‌ జీన్‌ కాపాడుతుందని తరువాత నిరూపించబడింది.

వలస విధానాల కారణంగా, మెడిటేరేరియన్‌, మిడిల్‌ ఈస్టర్న్‌, కౌకాసియన్‌, ఇండియన్‌, హిస్పానిక్‌, నేటివ్‌ అమెరికన్‌, ఇతర పుట్టుపూర్వోత్తరాలు గల ప్రజలు కూడా ప్రభావితం కావచ్చు.

Map of the prevalence of sickle cell disease around the world Map of the prevalence of sickle cell disease around the world

వలస విధానం సికిల్‌ సెల్‌ వ్యాధి స్వరూపాన్ని మార్చుతోంది.

ప్రజలు తమ మాతృదేశం నుంచి వలస వెళుతున్న కారణంగా, ఉత్తర మరియు దక్షిణ అమెరికా, మరియు యూరప్‌ లాంటి ప్రపంచంలోని భిన్న ప్రాంతాలపై సికిల్‌ సెల్‌ వ్యాధి ప్రభావం చూపిస్తోంది.

2010 నుంచి 2050 వరకు, సికిల్‌ సెల్‌ వ్యాధితో పుట్టే పిల్లల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30% పెరుగుతుందని అంచనా.

సికిల్‌ సెల్‌ వ్యాధి గురించిన కల్పితాలు మరియు వాస్తవాలు

సికిల్‌ సెల్‌ వ్యాధి గురించి ప్రపంచవ్యాప్తంగా చైతన్యం పెరుగుతుండటంతో, ఈ స్థితి గురించిన కల్పితాలను సవాలు చేయడం ముఖ్యం. ఈ కింది కల్పితాలు సామాన్యమైనవి మరియు వ్యాధి గల ప్రజలు, వాళ్ళ కుటుంబాలు మరియు సంరక్షకులు, స్నేహితులు, మరియు ఆరోగ్య సంరక్షణ అందించే ప్రజలను ప్రభావితం చేయవచ్చు. అంతర్లీన వాస్తవం ఏమిటో చూసేందుకు ఈ కింది కల్పితంపై క్లిక్‌ చేయండి.

కల్పితం: ఆఫ్రికా పుట్టుపూర్వోత్తరాలు గల ప్రజలకు మాత్రమే సికిల్‌ సెల్‌ వ్యాధి ఉంటుంది

వాస్తవం: సికిల్‌ సెల్‌ వ్యాధి ప్రధానంగా ఆఫ్రికన్‌ పుట్టుపూర్వోత్తరాలు గల వారిని ప్రభావితం చేయనున్నప్పటికీ, ఇది ప్రపంచంలోని భిన్న ప్రాతాలకు చెందిన ప్రజలను కూడా ప్రభావితం చేస్తుంది

కల్పితం: సికిల్‌ సెల్‌ వ్యాధి అంటువ్యాధి

వాస్తవం: సికిల్‌ సెల్‌ వ్యాధి అనేది వారసత్వ రక్త అవ్యవస్థ; ఇది అస్సలు అంటువ్యాధి కాదు! ఇది పుట్టుక సమయంలో మాత్రమే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుంది

కల్పితం: సికిల్‌ సెల్‌ వ్యాధి కొంత కాలం ఉండే స్థితి

వాస్తవం: నొప్పి సంఘటన కొంత సమయం మాత్రమే ఉండనున్నప్పటికీ, సికిల్‌ సెల్‌ వ్యాధి గల ప్రజలకు ఇది పుట్టుక సమయంలో కలుగుతుంది మరియు జీవితాంతం ఉంటుంది

కల్పితం: ఒక రకమైన సికిల్‌ సెల్‌ వ్యాధి మాత్రమే ఉంటుంది

వాస్తవం: వాస్తవానికి హెచ్‌బిఎస్‌సి, హెచ్‌బిఎస్‌ β‑ తలసీమియాతో సహా, కానీ వీటికే పరిమితం కాదు, అనేక రకాల సికిల్‌ సెల్‌ వ్యాధులు ఉంటాయి. వీటిల్లో హెచ్‌బిఎస్‌సి అత్యంత సామాన్యమైన స్థితి

కల్పితం: నొప్పి సంఘటనకు సికిల్డ్‌ ఎర్ర రక్త కణాలు ఏకైక కారణం

వాస్తవం: కథకు సికిల్డ్‌ కణాల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఎర్ర రక్త కణాలనే కాకుండా, శరీర రక్త యొక్క ఇతర కాంపొనెంట్‌లను సికిల్‌ సెల్‌ వ్యాధి ప్రభావితం చేయడానికి నొప్పి కారణం

కల్పితం: సికిల్‌ సెల్‌ వ్యాధి గల ప్రజలు నొప్పి మందు తీసుకుంటారు, దాని అవసరం లేకపోయినప్పటికీ

వాస్తవం: తీవ్రంగా ఉండే మరియు వైద్య జోక్యం అవసరమయ్యే నొప్పి, సికిల్‌ సెల్‌ వ్యాధి యొక్క మామూలు సంక్లిష్ట సమస్య. ఈ నొప్పి పోవడానికి నొప్పి ఉపశమన మందులు తరచుగా అవసరమవుతాయి

కల్పితం: సికిల్‌ సెల్‌ వ్యాధి గల ప్రజలకు ప్రేరణ మరియు చొరవ ఉండవు

వాస్తవం: సికిల్‌ సెల్‌ వ్యాధి శరీరం, మనసు మరియు ఈ స్థితి గల ప్రజల మొత్తం జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు. సికిల్‌ సెల్‌ వ్యాధి లక్షణాలు తెలియని ఇతరులు తప్పుగా అర్థంచేసుకునే, అలసట మరియు ఆతృత లాంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి

ఇప్పుడు మీరు NotAloneInSickleCell.com ని వదిలి వెళుతున్నారు.

మీరు NotAloneInSickleCell.com వెబ్‌సైట్‌ని వదిలివెళ్ళబోతున్నారు మరియు మూడవ పక్షం ఆపరేట్‌చేస్తున్న వెబ్‌సైట్‌లోకి ప్రవేశించబోతున్నారు. ఈ మూడవ పక్షం వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం బాధ్యత నోవార్టిస్‌ది కాదు మరియు నియంత్రించడం లేదు.